Share News

సాంఘిక సంక్షేమ శాఖకు రూ.20,644 కోట్లు

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:37 AM

సాంఘిక సంక్షేమ శాఖకు రూ.20,644 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో భవనాల కోసం రూ.100 కోట్లు, పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్పుల కోసం రాష్ట్ర వాటాగా రూ.536.50 కోట్లు...

సాంఘిక సంక్షేమ శాఖకు రూ.20,644 కోట్లు

ఇంటర్నెట్ డెస్క్: సాంఘిక సంక్షేమ శాఖకు రూ.20,644 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో భవనాల కోసం రూ.100 కోట్లు, పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్పుల కోసం రాష్ట్ర వాటాగా రూ.536.50 కోట్లు, ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కోసం రూ.389.88 కోట్లు, ప్రభుత్వ హాస్టళ్ల కోసం రూ.581 కోట్లు, భవనాల కోసం రూ.100 కోట్లు కేటాయించారు. ఎస్సీలకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.300 కోట్లు, అంబేడ్కర్‌ విగ్రహాలకు రూ.50 కోట్లు, పీఎం అజయ్‌ హాస్టల్‌ కాంపోనెంట్‌ కింద రూ.64 కోట్లు, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద రూ.185 కోట్లు, ఎస్సీలకు ఎన్టీఆర్‌ పెన్షన్‌ కింద రూ.4,973 కోట్లు, తల్లికి వందనం ఎస్సీ విద్యార్థులకు రూ.1,882 కోట్లు, డ్రైవర్లకు రూ.108 కోట్లు కేటాయించారు. ఇవి కాకుండా ఆయా శాఖలకు ఎస్సీ కాంపోనెంట్‌ ద్వారా కేటాయింపులు చేశారు.


గిరిజన సంక్షేమ శాఖకు రూ.9,190 కోట్లు

ఈ ఏడాది గిరిజన సంక్షేమ శాఖకు రూ.9,190 కోట్లు కేటాయించారు. వ్యవసాయశాఖకు రూ.572 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.54.84 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.16.68 కోట్లు, కళాశాల విద్యకు రూ.23.76 కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.227 కోట్లు, పాఠశాల విద్యకు రూ.449 కోట్లు, పౌరసరఫరాలకు రూ.402 కోట్లు, వైద్యశాఖకు రూ.451 కోట్లు, హౌసింగ్‌ కోసం రూ.1,414 కోట్లు, గ్రామీణ నీటిసరఫరాకు రూ.524 కోట్లు ఇలా పలు శాఖలకు ఎస్టీ కాంపోనెంట్‌ కేటాయించారు. దీంతో పాటు ఈసారి బడ్జెట్‌లో జెండర్‌, చైల్డ్‌ బడ్జెట్‌లకు వేర్వేరుగా కేటాయింపులు చేశారు.

Updated Date - Feb 15 , 2026 | 04:37 AM