Share News

14న రాష్ట్ర బడ్జెట్‌!

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:14 AM

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి జరగనున్నాయి. 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.

14న రాష్ట్ర బడ్జెట్‌!

  • 11 నుంచి మార్చి 12 వరకూ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి జరగనున్నాయి. 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. 12న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ రోజంతా తీర్మానంపై చర్చ ఉంటుంది. 13న ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతారు. 14న 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెడతారు. అదే రోజు సభలో వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. బడ్జెట్‌ సమావేశాలను నాలుగు వారాల పాటు నిర్వహించనున్నారు. మార్చి 12 వరకు సమావేశాలు జరగనున్నాయి.

Updated Date - Jan 29 , 2026 | 04:14 AM