Share News

హిందూ ధర్మాన్ని నిలువునా వంచించిన జగన్‌: బుచ్చి రాంప్రసాద్‌

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:36 AM

‘‘రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నిలువునా వంచించిన జగన్‌రెడ్డి... సొంత పత్రికలో తనని తాను ‘హిందూ ధర్మ పరిరక్షకుడు’ గా పేర్కొంటూ...

హిందూ ధర్మాన్ని నిలువునా వంచించిన జగన్‌: బుచ్చి రాంప్రసాద్‌

ఇంటర్నెట్ డెస్క్: ‘‘రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నిలువునా వంచించిన జగన్‌రెడ్డి... సొంత పత్రికలో తనని తాను ‘హిందూ ధర్మ పరిరక్షకుడు’ గా పేర్కొంటూ పేజీల కొద్దీ ప్రకటనలు ఇచ్చుకోవడం హాస్యాస్పదం’’ అని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచ్చిరాం ప్రసాద్‌ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు చేయించి ఇప్పుడు భక్తుడిగా నటిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. జగన్‌ పాలనలో సుమారు 300 దేవాలయాలపై దాడులు జరిగాయని, పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపించారు. జగన్‌ చేసిన పాపం ఎన్ని జన్మలెత్తినా పోదన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 04:36 AM