ఆహార భద్రతకు చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jun 23 , 2026 | 04:42 AM
రాష్ట్రంలో కల్తీ ఆహారం, నాసిరకం తినుబండారాల విక్రయం, అపరిశుభ్ర మాంసం దుకాణాలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
హోటళ్లు, మాంసం దుకాణాల్లో తనిఖీలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ డిమాండ్
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కల్తీ ఆహారం, నాసిరకం తినుబండారాల విక్రయం, అపరిశుభ్ర మాంసం దుకాణాలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘వారధి’ కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో అధికంగా ఆహార కల్తీపై ఉంటున్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలో పాలు కల్తీ, ఏలూరులో తాగునీటి కాలుష్యం, శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి, విజయవాడలో పాడైన మాంసం, అనకాపల్లి హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ లాంటి ఘటనలు ఆహార భద్రతలో లోపాల్ని ఎత్తిచూపుతున్నాయని తెలిపారు. ప్రతి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ పరీక్ష ల్యాబ్‌లు ఏర్పాటు చేసి... హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి 24గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు.