Share News

‘సర్‌’ గడువు పొడిగించాలి: బీజేపీ

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:17 AM

‘రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎన్యుమరేషన్‌ సిబ్బంది ఓటర్లను ఇంకా కలవలేదు. ఓటర్లకు సహాయం గా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి.

‘సర్‌’ గడువు పొడిగించాలి:  బీజేపీ

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎన్యుమరేషన్‌ సిబ్బంది ఓటర్లను ఇంకా కలవలేదు. ఓటర్లకు సహాయం గా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఇందుకోసం సర్‌ ప్రక్రియ గడువు మరింత పొడిగించాలి. లేదంటే అర్హులైన ఓటర్లు సవరణ జాబితాకు దూరమయ్యే అవకాశం ఉంది’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌కు ఏపీ బీజేపీ ప్రతినిధి బృందం విన్నవించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్‌నాయుడు నేతృత్వంలోని బృందం మంగళవారం ఏపీ సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారిని కలిసింది. మరోవైపు, ఎన్యుమరేషన్‌ కాల వ్యవధిని కనీసం నెల రోజులు పొడిగించాలని జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి కోరారు. మంగళవారం ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. అర్హులైనవారిని జాబితా నుంచి తొలగించకుండా చూడాలని సీఈవోను కోరామన్నారు. ‘మేలుకో ఆంధ్రప్రదేశ్‌’ కో కన్వినర్‌ రమే్‌షపట్నాయక్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓటర్ల ఎన్యుమరేషన్‌ తప్పులతడకగా జరిగిందన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 05:18 AM