ఏపీ జీవ వైవిధ్య బోర్డుకు రూ.10 లక్షలు
ABN , Publish Date - Aug 23 , 2026 | 04:59 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డుకు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) రూ.10.51 లక్షలు విడుదల చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డుకు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) రూ.10.51 లక్షలు విడుదల చేసింది. 27 రాష్ట్రాల జీవ వైవిధ్య బోర్డులు, 3 కేంద్రపాలిత ప్రాంత జీవ వైవిధ్య మండళ్లు, కర్ణాటకలోని ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్‌కు కలిపి ఎన్‌బీఏ శనివారం రూ.2.82 కోట్లు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధిత ఉద్యాన పంటల సాగును పరిగణనలోకి తీసుకుని ఈ నిధులను కేటాయించింది. ఈ నిధుల్లో గుజరాత్‌కు రూ.44.59 లక్షలు, పశ్చిమ బెంగాల్‌కు రూ.41.24 లక్షలు, మధ్యప్రదేశ్‌కు రూ.32.73 లక్షలు విడుదల చేయగా, మన రాష్ట్రానికి రూ.10.51 లక్షలు విడుదలయ్యాయి.