జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కాలమ్ చేర్చాలి
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:28 AM
జనగణన ఫా ర్మాట్‌లోని ప్రశ్నావళిలో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి వీరేంద్రకుమార్‌కు ఏపీ బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు విజ్ఙప్తి చేశారు.
కేంద్ర మంత్రికి ఏపీ బీసీ సంక్షేమ సంఘం వినతి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): జనగణన ఫా ర్మాట్‌లోని ప్రశ్నావళిలో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి వీరేంద్రకుమార్‌కు ఏపీ బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు విజ్ఙప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జనగణన ఫార్మాట్ ప్రశ్నావళిలోని 12వ ప్రశ్నను పరిశీలిస్తే... కుటుంబ పెద్ద.. ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గం అని మాత్రమే ఉందని, వాటితోపాటు ఓబీసీ కాలమ్‌ను కూడా చేర్చి సమగ్ర కులగణన చేపట్టాలని విన్నవించారు. శుక్రవారం కేంద్రమంత్రితో ఆయన కార్యాలయంలో సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావుతో కలిసి శంకరరావు భేటీ అయ్యారు. మరోవైపు.. పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేశ్ విజ్ఞప్తి చేశారు.