రేపే బార్ కౌన్సిల్ ఎన్నికలు.. పోటీలో 143 మంది
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:02 AM
ఏపీ బార్ కౌన్సిల్‌కు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా 143 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఏపీ బార్ కౌన్సిల్‌కు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా 143 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 148 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన 25మంది సభ్యుల్లో 19మంది తిరిగి పోటీ చేస్తున్నారు. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మహిళలకు 30శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో ఎన్నికల బరిలో ఉన్న మహిళ న్యాయవాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. బార్ కౌన్సిల్‌కు 25మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఇందులో ఒకరిని చైౖర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. అడ్వొకేట్ జనరల్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు.