మిమ్మల్ని చూసి పిల్లలేం నేర్చుకుంటారు?
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:17 AM
సభ గౌరవాన్ని పెంచకపోయినా ఫరవాలేదు కానీ.. దిగజార్చే చర్యలకు దిగొద్దని ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హితవు పలికారు....
అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సభ గౌరవాన్ని పెంచకపోయినా ఫరవాలేదు కానీ.. దిగజార్చే చర్యలకు దిగొద్దని ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. గవర్నర్ ప్రసంగ సమయంలో వైసీపీ సభ్యుల నిరసనలనుద్దేశించి గురువారం ఆయన శాసనసభలో స్పందించారు. ‘‘నిన్న జరిగిన ఘటన చాలా బాధ కలిగించింది. ఇటీవలే మంత్రి లోకేశ్ నేతృత్వంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ జరిగింది. చట్టసభలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మంచి పరిణామం. ఇతర రాష్ర్టాల్లోనూ దీనికి అభినందనలు లభించాయి. ఈ సమావేశాల నుంచి విద్యార్థులకు సభను వీక్షించే అవకాశం కల్పించాం. మా పిల్లల్ని పంపిస్తామని 200కు పైగా విద్యాసంస్థలు ముందుకొచ్చాయు. కానీ నిన్న ఏం జరిగింది? నినాదాలు చేయడం చూసి వారేం నేర్చుకుంటారు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ప్యానెల్ స్పీకర్లుగా ఆరుగురు: ప్యానెల్ స్పీకర్లుగా మండలి బుద్ధప్రసాద్, వరదరాజులురెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలితకుమారి, దాసరి సుధ, విష్ణుకుమార్‌రాజు వ్యవహరిస్తారని స్పీకర్ ప్రకటించారు.