Share News

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ బిల్లు

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:16 AM

బీసీ బిల్లును ఈ నెల 17న ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు వీలుగా బీసీల రక్షణ కోసం..

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ బిల్లు

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): బీసీ బిల్లును ఈ నెల 17న ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు వీలుగా బీసీల రక్షణ కోసం ఉద్దేశించిన బిల్లును సిద్ధం చేయాలని సంబంధిత శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు సూపర్‌ సిక్స్‌, ఇతర సంక్షేమ పథకాలు, శాంతిభద్రతలు, ఎల్‌నినో ప్రభావం, పెట్టుబడులు-పరిశ్రమలు, ఉద్యోగాలు-జాబ్‌ క్యాలెండర్‌ తదితర అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఈ అంశాలపై అవసరమైన వివరాలు, ప్రజెంటేషన్లు సిద్ధం చేయాలని సంబంధిత శాఖలను సీఎస్‌ ఆదేశించారు.

Updated Date - Aug 10 , 2026 | 03:18 AM