Share News

బందోబస్తు తగ్గింది.. సందర్శకుల సంఖ్య పెరిగింది!

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:29 AM

సరైన ప్రణాళిక, టెక్నాలజీతో అసెంబ్లీ సమావేశాల బందోబస్తుకు వ చ్చే భద్రతా సిబ్బందిని ఈ దఫా భారీగా తగ్గించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ బందోబస్తుకు...

బందోబస్తు తగ్గింది..  సందర్శకుల సంఖ్య పెరిగింది!

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): సరైన ప్రణాళిక, టెక్నాలజీతో అసెంబ్లీ సమావేశాల బందోబస్తుకు వ చ్చే భద్రతా సిబ్బందిని ఈ దఫా భారీగా తగ్గించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ బందోబస్తుకు 3,206 మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి, అసెంబ్లీ పరిసరాల్లో యుద్ధ వాతావరణం సృష్టించారు. ఇప్పుడు కేవలం 663 మందితో భద్రత ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమ తాకిడికి భయపడిన వైసీపీ ప్రభ ుత్వం.. భద్రత పెంచి రాజధాని గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. వీఐపీ మార్గం పొడవునా పోలీసుల భద్రత, పరదాలు ఏర్పాటు చేసి వాటి మాటున.. నాటి సీఎం, వైసీపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేవారు. ఇప్పుడు వీఐపీ మార్గంలో తక్కువ సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏర్పా టు చేయడమే కాకుండా, ఎక్కడా పరదాలు కనిపించకుండా చేశారు. అప్పట్లో అసెంబ్లీకి సందర్శకులను కూడా అనుమతించకుండా కట్టడి చేశారు. ఇప్పుడు పెద్ద ఎత్తున సందర్శకులను అనుమతించడమే కాకుండా ప్రతిరోజూ అసెంబ్లీ సమావేశాలను వీక్షించేందుకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు నిత్యం వందలాది మంది విద్యార్థులతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడుతోంది.

Updated Date - Mar 05 , 2026 | 04:29 AM