Share News

వృత్తిపర సామర్థ్యం మెరుగుపర్చుకోవాలి

ABN , Publish Date - May 22 , 2026 | 05:46 AM

శాసన వ్యవస్థ ఉద్యోగులు తమ వృత్తిపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నప్పుడే విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలుగుతారని రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ సూర్యదేవర అన్నారు

వృత్తిపర సామర్థ్యం మెరుగుపర్చుకోవాలి

  • అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌

అమరావతి, మే 21 (ఆంధ్రజ్యోతి): శాసన వ్యవస్థ ఉద్యోగులు తమ వృత్తిపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నప్పుడే విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలుగుతారని రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ సూర్యదేవర అన్నారు. అమరావతి అసెంబ్లీ సచివాలయంలో అధికారులు, సిబ్బందికి నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ గురువారం ముగిసింది. లోక్‌సభ సచివాలయ అనుబంధ పార్లమెంటరీ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమెక్రసీస్‌ (ప్రైడ్‌) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. విభిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే పురోగతి సాధ్యమన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో 100 మందికి పైగా అసెంబ్లీ అధికారులు, సిబ్బందికి పార్లమెంటరీ విశేషాధికారాలు, బడ్జెట్‌ ప్రక్రియ, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌, ప్రైవేటు బిల్లులు, తీర్మానాలు, స్థాయి సంఘాలు, ఆర్థిక కమిటీలు వంటి శాసన వ్యవహారాలతో పాటు శాసన వ్యవస్థ-మీడియా సంబంధాలు తదితర అంశాలపై శిక్షణ అందించారు.

Updated Date - May 22 , 2026 | 05:46 AM