అసెంబ్లీ సిబ్బందికి శిక్షణ తరగతులు ప్రారంభం
ABN , Publish Date - May 20 , 2026 | 04:08 AM
రాష్ట్ర శాసనసభ సచివాలయ అధికారుల సామర్థ్యాభివృద్ధి కోసం ఉద్దేశించిన మూడు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మంగళవారం అమరావతి అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రారంభమైంది.
అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ సచివాలయ అధికారుల సామర్థ్యాభివృద్ధి కోసం ఉద్దేశించిన మూడు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మంగళవారం అమరావతి అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రారంభమైంది. లోక్‌సభకు చెందిన పార్లమెంటరీ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ (ప్రైడ్) సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ప్రారంభించారు. కొత్తగా నియమితులైన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు శాసన వ్యవహారాల నిర్వహణ, ఆధునిక పరిపాలనా విధానాలు, కార్యనిర్వహణ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించనున్నారు.