Share News

మార్చి 7 వరకు అసెంబ్లీ 17 పనిదినాలు సమావేశాల నిర్వహణ

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:44 AM

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 17 పనిదినాలు సమావేశాలు నిర్వహించాలని బుధవారం స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ)లో నిర్ణయించారు.

మార్చి 7 వరకు అసెంబ్లీ 17 పనిదినాలు సమావేశాల నిర్వహణ

  • 14న రాష్ట్ర బడ్జెట్‌.. 17, 18న దానిపై చర్చ

  • సభావ్యవహారాల సలహా సంఘం నిర్ణయం

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 17 పనిదినాలు సమావేశాలు నిర్వహించాలని బుధవారం స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ)లో నిర్ణయించారు. శాసనసభ సమావేశాలను ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరపాలని నిర్ణయించారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాల మేరకు... ‘14న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 15, 16 తేదీలు సెలవులు. 17, 18న బడ్జెట్‌పై చర్చ, 18న ఆర్థిక మంత్రి సమాధానం ఉంటాయి. 19 నుంచి 8 పనిదినాలు డిమాండ్లు, గ్రాంట్లుపై చర్చ ఉంటుంది. 28న శనివారం అయినా అసెంబ్లీ జరుగుతుంది. మార్చి 1, 2, 3 తేదీలు అసెంబ్లీకి సెలవులు. అవసరాన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని బీఏసీలో నిర్ణయించారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు... గంటపాటు క్వశ్చన్‌ అవర్‌ ఉంటుంది. ఆ తర్వాత అరగంటపాటు జీరో అవర్‌ నిర్వహించి అరగంట టీ బ్రేక్‌ ఇస్తారు. తిరిగి 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సమావేశాలు జరుగుతాయి. జీరో అవర్‌లో ప్రతి సభ్యుడూ 2 నిమిషాలు మాత్రమే మాట్లాడేలా చూడాలని విప్‌లకు సూచించారు. ఈసారి సారూప్యత కలిగిన శాఖలన్నింటిపైన ఒకే రోజు చర్చ జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం మొత్తం అన్ని శాఖలను 8 గ్రూపులుగా చేశారు. ప్రజాప్రతినిధులకు ఆటల పోటీలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో విజయవాడలో, మార్చి 6న ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలు రాజధాని అమరావతిలోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తారు.’

Updated Date - Feb 12 , 2026 | 01:44 AM