24 నుంచి సభ్యులకు క్రీడాపోటీలు: స్పీకర్
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:01 AM
ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ సభలో ప్రకటించారు.
అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ సభలో ప్రకటించారు. ఈ పోటీల్లో పాల్గొని విజేతలైన ఎమ్మెల్యేలకు సమావేశాల చివరి రోజున బహుమతులు అందజేస్తారన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు ఆయా చీఫ్ విప్‌లకు పేర్లు ఇవ్వాలన్నారు. సభ చివరి రోజు బహుమతుల ప్రదానం కార్యక్రమంలో కుటుంబ సమేతంగా హాజరుకావాలని స్పీకర్ సభ్యులను కోరారు. కాగా, 24, 25, 26 తేదీల్లో విజయవాడలో క్రీడా పోటీలను, మార్చి 6న సాంస్కృతిక కార్యక్రమాలను రాజధాని అమరావతిలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు.