Share News

అంబటి ఓ క్రిమినల్‌.. రాజకీయ ఉగ్రవాది

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:57 AM

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే ఓ క్రిమినల్‌ అని శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు...

అంబటి ఓ క్రిమినల్‌.. రాజకీయ ఉగ్రవాది

  • మండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ

అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే ఓ క్రిమినల్‌ అని శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను అడ్డగోలుగా దోచుకుని, ఇప్పుడు కులం కార్డు బయటకు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు, ఆర్యవైశ్యులను అడ్డగోలుగా దోచుకున్న రాజకీయ ఉగ్రవాది రాంబాబు అని విమర్శించారు. చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను జగన్‌ తిట్టించినప్పుడు.. అంబటికి కాపు కులం గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. కాపులతోపాటు అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టిందే కాకుండా.. ఇప్పుడు తగ్గేదేలే అంటూ సైగలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనేశ్వరిపై మాట్లాడినప్పుడే ఆయనకు కుటుంబసభ్యులు గడ్డి పెట్టి ఉంటే, నేడు వారు రోడ్డెక్కాల్సిన పని ఉండేది కాదని హితవు పలికారు. కాపులు తాగుబోతులంటూ అంబటి చేసిన వ్యాఖ్యలను అనురాధ మీడియాకు వినిపించారు.

Updated Date - Feb 14 , 2026 | 02:57 AM