Share News

‘ఆషా’ సమ్మె విరమణ

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:09 AM

ఎన్టీఆర్‌ వైద్యసేవ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వారం రోజులుగా నిలిచిపోయిన వైద్యసేవలు పునఃప్రారంభం కానున్నాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిల్లో...

‘ఆషా’ సమ్మె విరమణ

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ వైద్యసేవ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వారం రోజులుగా నిలిచిపోయిన వైద్యసేవలు పునఃప్రారంభం కానున్నాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిల్లో రూ.1000 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆషా (ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌) రాష్ట్ర కార్యవర్గం ప్రకటించింది. అలాగే ఆస్పత్రులకు ప్రతినెలా రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల వరకూ బిల్లులు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ అమలుకు విధివిధానాల కల్పనలోనూ ఆషా ప్రతినిధులు, ఇతరుల భాగస్వామ్యంతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ హామీ ఇవ్వడంతో ఆషా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Apr 08 , 2026 | 04:09 AM