Share News

71,602 కోట్ల పెట్టుబడులు.. 14,250 మందికి ఉద్యోగావకాశాలు..

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:59 AM

కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల..

71,602 కోట్ల పెట్టుబడులు.. 14,250 మందికి ఉద్యోగావకాశాలు..

  • రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడి ప్రతిపాదనలు

  • రూ.58,743 కోట్లతో విశాఖలో డేటా సెంటర్‌

  • డేటా సెంటర్‌ హోల్డింగ్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీకి ఓకే

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) సమావేశం రూ.71,602.06 కోట్ల పెట్టుబడులతో 14,250 మందికి ఉద్యోగావకాశాలులు కల్పించే 18 పెట్టుబడుల ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఎస్‌ఐపీసీ ఆమోదం తెలిపినవి

  • విశాఖపట్నంలో రూ.58,743 కోట్లతో 1,2 50 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ‘డేటాసెంటర్‌ హోల్డింగ్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ’ భారీ స్థాయిలో డేటా సెంటర్‌ ఏర్పా టు చేసేందుకు ఎస్‌ఐపీసీ ఆమోదం తెలిపింది.

  • తిరుపతిలో ‘మునోత్‌ లిథియం బ్యాటరీ లిమిటెడ్‌’ రూ.500 కోట్లతో 240 మందికి ఉద్యోగాలు కల్పించే లిథియం సెల్‌ తయారీ యూనిట్‌ స్థాపనకు ఏపీ ఎలకా్ట్రనిక్స్‌ పాలసీ మేరకు ఆమోదం.

  • ‘ఏఐఎల్‌ డిక్సన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కొప్పర్తి ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సెంటర్‌ (ఈఎంసీ)లో రూ.450 కోట్ల పెట్టుబడితో 7,000 మందికి ఉపాధి కల్పించే సీసీటీవీలు, ఎలకా్ట్రనిక్స్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ తయారీ సంస్థలకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆమోదం.

  • ‘సీఆర్‌ఆర్‌ హాస్పిటాలిటీ’ తిరుపతిలో రూ. 192.02 కోట్లతో 200 మందికి ఉద్యోగాలు కల్పించే హోటల్‌ నిర్మాణానికి ఆమోదం.

  • ‘జేఎస్సీ హోటల్స్‌ రిసార్ట్స్‌’ విజయవాడలో రూ.63.79 కోట్లతో 100 మందికి ఉద్యోగాలిచ్చే హోటల్‌ నిర్మాణానికి ఆమోదం.

  • తిరుపతిలో ‘పావులూరి హోటల్స్‌’ రూ.58.74 కోట్లతో 120 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌.


  • తిరుపతిలో ‘మృగవాణి రిసార్ట్స్‌’ రూ. 73.38 కోట్లతో 129 మందికి ఉద్యోగాలను కల్పించే సంస్థకు లీజు గడువు పెంపు.

  • గుత్తపాడు, ఓర్వకల్లు వద్ద రూ.7799.96 కోట్లతో ‘అగస్త్య గ్రీన్‌ ఎనర్జీ’కి 150.90 ఎకరాలు.. ఎకరా రూ.10 లక్షల చొప్పున కేటాయించేందుకు ఆమోదం.

  • రూ.2,125 కోట్ల పెట్టుబడితో ‘కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌’కు శ్రీకాకుళం జిల్లా మూలపేటలో 450 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం.

  • నెల్లూరు జిల్లా దుత్తలూరులో ‘సన్‌షైన్‌ ఎనర్జీస్’కు 455 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం.

  • కర్నూలులో రూ.300 కోట్లతో 350 మందికి ఉద్యోగాలిచ్చే ‘జయాదిత్య ప్రై.లిమిటెడ్‌’కు రాష్ట్ర ఆహారోత్పత్తి సంస్థల పాలసీ (2024-29) మేరకు రాయితీలు కల్పించాలని నిర్ణయం.

  • నెల్లూరులో రూ.330.71 కోట్లతో 1,110 మందికి ఉద్యోగాలు కల్పించే ‘ప్రిసోల్‌ ఆగ్రో ఇండిస్ట్రీ్‌స’కు ఆమోదం.

Updated Date - Jul 25 , 2026 | 06:01 AM