ఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్
ABN , Publish Date - May 24 , 2026 | 04:42 AM
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) చైర్మన్‌గా పి.భరత్ భూషణ్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది.
17 మంది డైరెక్టర్లతో బోర్డు ఏర్పాటు
అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) చైర్మన్‌గా పి.భరత్ భూషణ్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 13 మంది డైరెక్టర్ల పేర్లను ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది. చిక్కాల మెహర్ రమేశ్‌కుమార్, సుమన్ తల్వార్, ఎస్.శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్, వై.ఝాన్సీ, కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, వి.సముద్ర, కె.ఉమామహేశ్వరరావు, మీర్.ఎస్, కందిమళ్ల సాంబశివరావు, ఎస్.వెంకట కృష్ణారెడ్డి, జీ.రాజ్‌వెంకటేశ్వర యాదవ్, డి.సత్యనారాయణలను డైరెక్టర్లుగా నియమించింది. వీరితోపాటు పబ్లిక్ ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ, ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీ, ఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ ఎండీని ప్రభుత్వం అదనపు డైరెక్టర్లు నియమించింది. మొత్తంగా చైర్మన్ సమా 17 మందితో కార్పొరేషన్ బోర్డును ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.