‘పీఎన్‌జీ’కి ఏటా 2400 సబ్సిడీ: సీఎస్
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:09 AM
రాష్ట్రంలో సహజ వాయువు(పీఎన్‌జీ) వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించిందని ప్రభుత్వ...
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సహజ వాయువు(పీఎన్‌జీ) వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) జి.సాయిప్రసాద్ తెలిపారు. ఈ విధానాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సహకరించాలన్నారు. బుధవారం సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి యుటిలిటీస్ కో-ఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం జరిగింది. రాష్ట్రంలో పీఎన్‌జీ/సీఎన్‌జీ వినియోగాన్ని విస్తరించేందుకు ‘ఏపీ సీజీడీ రైట్ ఆఫ్ వే రూల్స్-2026’ను ప్రభుత్వం ఈ నెల 23 నుంచి అమల్లోకి తీసుకువచ్చిందని, అనుమతుల ప్రక్రియను పూర్తిగా సరళీకృతం చేసిందని సీఎస్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఏపీ పీఎన్‌జీ సబ్సిడీ పథకం’ ద్వారా గృహ వినియోగదారులకు సంవత్సరానికి రూ.2,400 సబ్సిడీని అందించనున్నట్లు తెలిపారు. ప్రతి రెండు నెలలకు రూ.400 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు.