Share News

రిలయన్స్‌ డేటా సెంటర్‌కు రూ.19 వేల కోట్ల రాయితీలు

ABN , Publish Date - May 21 , 2026 | 04:30 AM

విజయనగరం జిల్లా పోలిపల్లిలో రూ.1,08,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్‌కు దాదాపు రూ.19 వేల కోట్ల వరకూ రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది..

రిలయన్స్‌ డేటా సెంటర్‌కు రూ.19 వేల కోట్ల రాయితీలు

  • ఉత్తర్వు జారీ చేసిన ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌

అమరావతి, మే20(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా పోలిపల్లిలో రూ.1,08,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్‌కు దాదాపు రూ.19 వేల కోట్ల వరకూ రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ బుధవారం ఉత్తర్వు జారీ చేశారు. ఈ డేటా సెంటర్‌లో ఉద్యోగాలు వెయ్యి వరకు ఉంటాయని అందులో పేర్కొన్నారు. తాజా ఉత్తర్వు ప్రకారం... జల వనరుల శాఖ, ఏపీఐఐసీ, మునిపల్‌ శాఖలు ప్రతిపాదించిన మేరకు 20 ఏళ్ల పాటు గ్యారెంటీతో కూడిన నీటి సరఫరా ఉంటుంది. ఈ నీటి సరఫరా ఖర్చును రిలయన్స్‌ సంస్థ భరిస్తుంది. డీ శాలినేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై ఏపీఐఐసీ సమగ్ర అఽధయనం చేస్తుంది. రిలయన్స్‌ డేటా సెంటర్‌కు అవసరమైన 853.97 ఎకరాల భూమిని 25శాతం రాయితీతో అందిస్తున్నారు. భూమి విలువలో 75శాతం రిలయన్స్‌ సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. ల్యాండింగ్‌ కేబుల్‌ స్టేషన్‌ కోసం మరో ఎకరా భూమిని ఏపీఐఐసీ, జిల్లా యంత్రాంగం గుర్తించాల్సి ఉంటుంది. భూ రిజిస్ట్రేషన్‌ చార్జీలను పూర్తిగా మినహాయించారు. యంత్రాలు, పరికరాలపై పెట్టిన పెట్టుబడిలో 6 శాతం మూలధనం రాయితీని గరిష్ఠంగా రూ.4,500 కోట్ల పరిమితికి లోబడి 10 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. డేటా సెంటర్‌ నిర్మాణంపై 100 శాతం ఎస్‌జీఎ్‌సటీ మినహాయింపు ఇస్తారు. ఈ ప్రోత్సాహకం రూ.2,527.38 కోట్లకు పరిమితమని పేర్కొన్నారు. లీజులపైనా రూ.1,800 కోట్లకు మించకుండా ఎస్‌జీఎ్‌సటీ మినహాయింపు ఉంది. నీటి టారి్‌ఫపై పదేళ్ల పాటు 15 శాతం రాయితీని రూ.552.41 కోట్లు ఇస్తారు. ఆప్టికల్‌ గ్రౌండ్‌ ఫైబర్‌ యాక్సె్‌సపైరాయితీ 20 సంవత్సరాల పాటు 30 శాతం చొప్పున రాయితీ ఉంటుంది. ఈ ప్రోత్సాహకం రూ.1,229.71గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వ్యయాన్ని ‘రైట్‌ ఆఫ్‌ వే’ కింద రూ.200 కోట్లు మినహాయిస్తారు. విద్యుత్తు సంబంధించి క్రాస్‌ సబ్సిడీ మొత్తం రూ.3,114.18 కోట్లుగా పేర్కొన్నారు. క్యాపిటివ్‌ సోలార్‌ పార్కుకు 20 ఏళ్లపాటు క్రాస్‌ సబ్సిడీ సర్‌చార్జీ ఉండదు. ట్రాన్స్‌మిషన్‌, వీలింగ్‌ చార్జీలనూ 20 ఏళ్ల పాటు మినహాయించారు. విద్యుత్తు సుంకంపై 15 ఏళ్ల పాటు 100 శాతం మినహాయింపు (రూ.186.85 కోట్ల గరిష్ఠ పరిమితి) ఇస్తారు. కాగా, రిలయన్‌ సంస్థ పెట్టుబడులకు ఎస్‌ఐపీసీ, ఎస్‌ఐపీబీతో పాటు రాష్ట్ర మంత్రి మండలి ఇప్పటికే ఆమోదముద్ర వేశాయి.

Updated Date - May 21 , 2026 | 04:30 AM