యూరియా కొరత లేకుండా చర్యలు
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:39 AM
ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు.
ఖరీఫ్ ప్రణాళికపై అగ్రికల్చర్ డైరెక్టర్ సమీక్ష
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమయిన నేపథ్యంలో సోమవారం తమ శాఖకు చెందిన వివిధ విభాగాధిపతులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, వాతావరణంలో ఎల్‌నినో ప్రతికూల పరిస్థితులు వ్యవసాయంపై ప్రభావం చూపనున్నందున అధికారులు, సిబ్బంది ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతుల డేటాను ఐఎ్‌ఫఎంఎ్‌సతో అనుసంధానించి ఎరువుల సరఫరాను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నందున ఆన్‌లైన్ విధానంలో యూరియా నిల్వలను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.