ఏపీ అడ్వొకేట్స్ క్రికెట్ టీమ్‌కు సీజే అభినందనలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:03 AM
ప్రతిష్ఠాత్మక 7వ సౌత్ ఇండియా అడ్వొకేట్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన ఏపీ అడ్వొకేట్స్ క్రికెట్ టీమ్‌ను హైకోర్టు ...
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక 7వ సౌత్ ఇండియా అడ్వొకేట్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన ఏపీ అడ్వొకేట్స్ క్రికెట్ టీమ్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బెంగుళూరు వేదికగా ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఏపీ జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజేతగా నిలిచింది. ఏపీ అడ్వొకేట్స్ క్రికెట్ టీమ్‌ను అభినందించిన వారిలో ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్స్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి.సురేష్ కుమార్, బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.