Share News

జలవనరుల శాఖ ఇంజనీర్లపై అభియోగాలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:27 AM

విధి నిర్వహణలో అలసత్వం, అవినీతికి పాల్పడిన ఇంజనీరింగ్‌ అధికారులపై జలవనరుల శాఖ అభియోగాలు జారీ చేసింది. దీనికి అధికారులు సంజాయిషీ

జలవనరుల శాఖ ఇంజనీర్లపై అభియోగాలు

సంజాయిషీ ఇవ్వకపోగా రాజకీయ ఒత్తిళ్లు.. ప్రభుత్వం సీరియస్‌

విధి నిర్వహణలో అలసత్వం, అవినీతికి పాల్పడిన ఇంజనీరింగ్‌ అధికారులపై జలవనరుల శాఖ అభియోగాలు జారీ చేసింది. దీనికి అధికారులు సంజాయిషీ ఇవ్వకపోగా వాటిని ఉపసంహరించాలంటూ రాజకీయ ఒత్తిడి తెస్తున్నారు. దీనిని శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ తీవ్రంగా పరిగణించారు. రాజకీయ నాయకులతో సిఫారసు లేఖలు రాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యేక మెమో జారీ చేశారు. ప్రస్తుతం కురిచేడు సబ్‌డివిజన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనూరాధ.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నరుకుల్లపాడులో పనిచేస్తున్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారంటూ అభియోగాలు వచ్చాయి. ప్రభుత్వం సంజాయిషీ కోరడంతో తనపై మోపిన అభియోగాలను ఉపసంహరించుకోవాలంటూ స్థానిక నేత ద్వారా ఒత్తిళ్లు తీసుకొచ్చారు.

Updated Date - Apr 18 , 2026 | 03:27 AM