AP Development: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి!
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:00 AM
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రూ.5,000 కోట్లతో చేపడుతున్న ప్రపంచస్థాయి ఉత్పత్తి కేంద్ర పురోగతిపై మంత్రి శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు.
శ్రీసిటీలో ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్ ప్లాంట్ పురోగతిపై లోకేశ్ స్పందన
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రూ.5,000 కోట్లతో చేపడుతున్న ప్రపంచస్థాయి ఉత్పత్తి కేంద్ర పురోగతిపై మంత్రి శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. 2025 మేలో ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌కి భూములు కేటాయిస్తే కేవలం 7 నెలల కాలంలో పనుల్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. ఈమేరకు పనుల ఫొటోలను తన పోస్టుకు జత చేశారు. ఇక్కడ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు తయారు చేయనున్నారని, ఏపీ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ఉత్పత్తి కేంద్రం ఉపయోపడుతుందని అన్నారు. 2026 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలన్న ప్రణాళికతో పనులు సాగుతున్నాయన్నారు. 2029 వరకు దశలవారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో మైలురాయి అని లోకేశ్ అభివర్ణించారు.