Share News

మార్కెట్‌ ఫీజు రూ.748.45 కోట్లు వసూలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:44 AM

రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ ఫీజు వసూళ్లలో 92.13శాతం లక్ష్యాన్ని సాధించినట్లు మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ కాకుమాను శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు.

మార్కెట్‌ ఫీజు రూ.748.45 కోట్లు వసూలు

  • 92శాతం లక్ష్యాన్ని సాధించాం: డైరెక్టర్‌ శ్రీనివాస్‌

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ ఫీజు వసూళ్లలో 92.13శాతం లక్ష్యాన్ని సాధించినట్లు మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ కాకుమాను శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చెక్‌పోస్టుల ద్వారా రూ.812.36కోట్ల లక్ష్యంలో రూ.748.45కోట్లు వసూలయ్యిందన్నారు. విశాఖపట్నం రీజియన్‌లో 97.25ు, విజయవాడ రీజియన్‌లో 87.84శాతం, కడప రీజియన్‌లో 99.52శాతం వసూలైనట్లు వివరించారు.

Updated Date - Apr 04 , 2026 | 03:45 AM