Share News

అకడమిక్‌ క్యాలెండర్‌ ఏదీ?

ABN , Publish Date - Jun 22 , 2026 | 06:22 AM

బడులు తెరిచే వరకు అకడమిక్‌ క్యాలెండర్‌ కోసం ఎదురు చూడకూడదని, ప్రస్తుత విద్యా సంవత్సరం ముగుస్తున్నప్పుడే వచ్చే సంవత్సరం క్యాలెండర్‌ విడుదల చేయాలని..

అకడమిక్‌ క్యాలెండర్‌ ఏదీ?

  • బడులు తెరిచినా ఊసేలేదు.. గతేడాది నెల రోజుల ముందే

అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): బడులు తెరిచే వరకు అకడమిక్‌ క్యాలెండర్‌ కోసం ఎదురు చూడకూడదని, ప్రస్తుత విద్యా సంవత్సరం ముగుస్తున్నప్పుడే వచ్చే సంవత్సరం క్యాలెండర్‌ విడుదల చేయాలని విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఆయన ఆదేశాలను అధికారులు సక్రమంగా అమలు చేశారు. కానీ, ఈ ఏడాదికి వచ్చేసరికి మాత్రం నిర్లక్ష్యం చేశారు. 2026-27 విద్యా సంవత్సరం ఈ నెల 12 నుంచి ప్రారంభమైంది. బడులు తెరిచి 10 రోజులు అయింది. అయినప్పటికీ పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదు. ఎస్‌సీఈఆర్‌టీ ఈ క్యాలెండర్‌ రూపొందిస్తుంది. గతేడాది తరహాలో ఈ ఏడాది కూడా నెల రోజుల ముందే క్యాలెండర్‌ను తయారు చేశారు. కొద్ది రోజుల కిందట సచివాలయంలో మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన డీఈవోల సమావేశంలో ఈ క్యాలెండర్‌ను చూపించారు. అయితే, అధికారికంగా మాత్రం క్యాలెండర్‌ విడుదల కాలేదు. క్యాలెండర్‌ విడుదల గురించి మంత్రి పేషీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ జాప్యం జరిగినట్టు తెలిసింది. క్యాలెండర్‌ విడుదల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్తే ఏవైనా మార్పులుంటే సూచిస్తారు. లేనిపక్షంలో వెంటనే క్యాలెండర్‌ విడుదల చేస్తారు. ప్రాథమిక పాఠశాలలకు, ఉన్నత పాఠశాలలకు వేర్వేరు అకడమిక్‌ క్యాలెండర్‌లు ఉంటాయి. ఆ క్యాలెండర్‌ను అనుసరించి ఉపాధ్యాయులు ప్రణాళికలు రూపొందించుకుంటారు.

Updated Date - Jun 22 , 2026 | 06:24 AM