Share News

టెన్త్‌ షార్ట్‌ మార్కుల మెమోలు విడుదల

ABN , Publish Date - May 27 , 2026 | 06:00 AM

పదో తరగతి షార్ట్‌ మార్కుల మెమోలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు

టెన్త్‌ షార్ట్‌ మార్కుల మెమోలు విడుదల

అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి షార్ట్‌ మార్కుల మెమోలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మెమోలు పాఠశాలల లాగిన్లలో అందుబాటులో ఉన్నాయని, ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్‌ చేసి సంతకం, సీల్‌తో విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే, ఈ నెల 29 నుంచి జూన్‌ 4 వరకు మార్పులు చేసుకునే అవకాశం ఇచ్చామని తెలిపారు.

Updated Date - May 27 , 2026 | 06:01 AM