టెన్త్ పరీక్షలకు 25శాతం మంది ప్రైవేటు టీచర్లు
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:08 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కొన్ని మార్పులు చేసింది. ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్లే ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కొన్ని మార్పులు చేసింది. ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్లే ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కుంటుపడుతోందని భావించిన పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది నుంచి 25శాతం మంది ప్రైవేటు టీచర్లను ఇన్విజిలేటర్లుగా తీసుకోనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ టెన్త్ పరీక్షల నిర్వహణపై నిబంధనలు రూపొందించింది. ఈఏడాది నుంచి ఇన్విజిలేటర్ల నియామకానికి ఆటోమేషన్ విధానం తీసుకొస్తోంది. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ విధానంలోనే ఇన్విజిలేటర్ల బాధ్యతల కేటాయింపు జరుగుతుంది. ఏప్రిల్ 4 నుంచి పది రోజుల పాటు జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. ఈ ఏడాది నుంచి మూల్యాంకనం కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నారు.