యాంటీబయాటిక్స్‌తో మానవాళికి ముప్పు
ABN , Publish Date - May 13 , 2026 | 05:25 AM
యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా వినియోగిస్తే మానవాళి భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని సెకండరీ హెల్త్ డైరెక్టర్ (డీఎస్‌హెచ్) కె.వి.ఎస్. చక్రధర్‌బాబు అన్నారు.
డీఎస్‌హెచ్ డైరెక్టర్ చక్రధర్ బాబు
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా వినియోగిస్తే మానవాళి భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని సెకండరీ హెల్త్ డైరెక్టర్ (డీఎస్‌హెచ్) కె.వి.ఎస్. చక్రధర్‌బాబు అన్నారు. డీఎస్‌హెచ్, ఎకో-ఇండియా సంయుక్తంగా ‘యాంటీమైక్రోబయాల్ స్టీవార్డ్‌షిప్’ (ఏఎంఎస్) పద్ధతులపై ఆరోగ్య సిబ్బందికి ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ప్రతి చిన్న జ్వరానికి యాంటీబయాటిక్స్ వాడటం మంచిది కాదన్నారు. ఏఎంఎస్ పద్ధతులపై మూడేళ్ల పైలట్ ప్రాజెక్టు కింద 200 మందికి శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎకో ఇండియా జనరల్ మేనేజర్ పరోమితాదాస్ స్వాగత, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సందీప్ భల్లా, మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ సుమిత్‌రాయ్ తదితరులు పాల్గొన్నారు.