ప్రజలను కుటుంబ సభ్యుల్లా చూస్తారు
ABN , Publish Date - May 12 , 2026 | 04:52 AM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలను సొంత కుటుంబ సభ్యులుగా చూస్తారని తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై కొనియాడారు.
డిప్యూటీ సీఎం పవన్‌ను కొనియాడిన బీజేపీ నేత అన్నామలై
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలను సొంత కుటుంబ సభ్యులుగా చూస్తారని తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై కొనియాడారు. ప్రజల సమస్యలను చిత్తశుద్ధి, కరుణ, బాధ్యతతో పరిష్కరించడానికి ఆయన కట్టుబడి ఉంటారని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి పవన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ఆయనకు మంచి ఆరోగ్యం, శక్తి, మరింత గొప్ప విజయం లభించాలని ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చూసిన పవన్ కల్యాణ్ అన్నామలైకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి నుంచి పళని వరకూ బస్సు సర్వీసు ఉండాలనే.. భక్తుల చిరకాల కోరిక పవన్ కల్యాణ్ నాయకత్వంలో సాకారమయ్యిందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఏపీఎ్‌సఆర్టీసీ రోజువారీగా రెండు సర్వీసులు ప్రారంభించిందన్నారు.