పెన్సిల్ లిడ్‌లపై చంద్రబాబు జీవిత చరిత్ర
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:22 AM
విజనరీ లీడర్, సీఎం చంద్రబాబు దార్శనికతతో స్ఫూర్తి పొందిన బాపట్ల జిల్లా చీరాలకు చెందిన అన్నం మహిత తన సూక్ష్మ సృజనకు పదును పెట్టారు.
చీరాల ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): విజనరీ లీడర్, సీఎం చంద్రబాబు దార్శనికతతో స్ఫూర్తి పొందిన బాపట్ల జిల్లా చీరాలకు చెందిన అన్నం మహిత తన సూక్ష్మ సృజనకు పదును పెట్టారు. అకుంటిత దీక్షతో 70 పెన్సిల్ లిడ్‌లపై ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చెక్కారు. అందుకోసం 40 రోజులు పట్టిందని ఆమె తెలిపారు. మహిత ఎంఏ సైకాలజీ చదువుతున్నారు. ఆమె తండ్రి నరసింహారావు ఆటో డ్రైవర్‌గా కాగా తల్లి భ్రమరాంబ గృహిణి. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత చరిత్రను చెక్కిన లిడ్‌లను చిత్రపటానికి అంటించి సోమవారం స్థానిక ఎమ్మెల్యే కొండయ్యకు మహిత అందజేశారు.