Share News

జగన్‌... ప్రగల్భాలు మానుకో

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:27 AM

జగన్మోహన్‌రెడ్డి అలా చేస్తాను, ఇలా చేస్తాను అంటూ ప్రగల్భాలు పలకడం మానుకోవాలి. ఆయన ఏం చేస్తారో చేసుకోమనండి. ఏమాత్రం చేయబోతున్నారో ప్రజలు...

జగన్‌... ప్రగల్భాలు మానుకో

  • రౌడీయిజం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం: మంత్రి అనిత

  • ఏలూరులో మహిళా స్టేషన్‌ను ప్రారంభించిన హోం మంత్రి

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘జగన్మోహన్‌రెడ్డి అలా చేస్తాను, ఇలా చేస్తాను అంటూ ప్రగల్భాలు పలకడం మానుకోవాలి. ఆయన ఏం చేస్తారో చేసుకోమనండి. ఏమాత్రం చేయబోతున్నారో ప్రజలు, మావిగన్‌లోనే చూశారు. మావిగన్‌ అనగానే అందరూ నవ్వుతున్నారు. అలాంటి వ్యక్తికోసం శుభకార్యం వద్ద తలచుకోవడం కూడా అశుభమే’ అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఏలూరులో రూ.2.73 కోట్లతో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ‘2019 నుంచి 2024 వరకూ ఒక్క ఫైర్‌ ఇంజన్‌ కాని, బోట్‌ కానీ కొనలేదు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.246 కోట్లతో వేసవి కాల పరిరక్షణ ప్రణాళికలో భాగంగా ఫైర్‌ ఇంజన్లు, ఇతర అవసరమైన పరికరాలను కొనుగోలు చేసి, ప్రారంభించాం. కూటమి ప్రభుత్వంలోనే నూతన పోలీస్‌ స్టేషన్‌ భవనాల నిర్మాణం, అవసరమైన పరికరాల కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. సోషల్‌ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టాలన్నా, మాట్లాడాలన్నా భయపడే విధంగా కఠినమైన చట్టాన్ని తీసుకురానున్నాం. ప్రస్తుతం రౌడీలే మా టార్గెట్‌. రౌడీయిజంపై, డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి అనిత పేర్కొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 03:27 AM