జంతు కళేబరాలతో వంట నూనెల తయారీ
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:00 AM
జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో జంతు కళేబరాలతో నూనెలు తయారు చేస్తున్న కేంద్రాలపై విజిలెన్సు అధికారులు మంగళవారం దాడులు చేశారు.
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో జంతు కళేబరాలతో నూనెలు తయారు చేస్తున్న కేంద్రాలపై విజిలెన్సు అధికారులు మంగళవారం దాడులు చేశారు. రెండు కేంద్రాల్లో తనిఖీలు చేసి 350 కేజీల నూనె స్వాధీనం చేసుకున్నారు. జంతువుల కొవ్వు, కళేబరాలను ఎండబెట్టి, ఆపై వాటిని కరిగించి డబ్బాల్లో పోసి.. దీనినే పామాయిల్ అంటూ వీధి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీనిని ఏలూరుతోపాటు జంగారెడ్డిగూడెం, రాజమహేంద్రవరంలకు చెందిన నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఏలూరు లంకపేటకు చెందిన బయ్యాపు వీరకాంతం అనే పశుమాంసం వ్యాపారిని, ఏలూరు ఆదివారపుపేట చిన మార్కెట్ ప్రాంతానికి చెందిన తోళ్ళ వ్యాపారి షేక్ సౌకర్‌లను అరెస్టు చేశారు.