Share News

మద్యం ముడుపులు చోక్రా ద్వారా మళ్లింపు

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:39 AM

మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ప్రధాన నిందితులు చాలా రహస్యంగా ముంబైకి చెందిన అనిల్‌ చోక్రా ద్వారా దారి మళ్లించినట్టు సిట్‌ పేర్కొంది.

మద్యం ముడుపులు చోక్రా ద్వారా మళ్లింపు

  • ఏసీబీ కోర్టులో 61 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన సిట్‌

విజయవాడ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ప్రధాన నిందితులు చాలా రహస్యంగా ముంబైకి చెందిన అనిల్‌ చోక్రా ద్వారా దారి మళ్లించినట్టు సిట్‌ పేర్కొంది. మద్యం కుంభకోణంలో ఏ49గా ఉన్న అనిల్‌ చోక్రాపై 61 పేజీల చార్జిషీటును విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్య వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు కేంద్ర బిందువుగా వ్యవహరించాడని పేర్కొంది. ‘రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, మద్యం డిస్టిలరీల మధ్య కమీషన్ల కుంభకోణం నడిచింది. మద్యం సరఫరా కొనసాగాలంటే కంపెనీలు తప్పనిసరిగా బేసిక్‌ ధరలో సుమారు 20 శాతం కిక్‌బ్యాక్‌ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 25కు పైగా షెల్‌ కంపెనీలను చోక్రా ఏర్పాటు చేశాడు. గతంలో రూ.304 కోట్లతో బ్యాంక్‌ను మోసం చేశాడు. ఆర్థిక మోసాల్లో అనిల్‌చోక్రాకు అనుభవం ఉంది’ అని సిట్‌ పేర్కొంది. ఈ నిధుల వ్యవహారాలను ముందుగా ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినా్‌షరెడ్డి పర్యవేక్షించాడని, తర్వాత ఆ బాధ్యతను చాణక్య తీసుకున్నాడని తెలిపింది.

Updated Date - Feb 12 , 2026 | 01:39 AM