Share News

ఎస్‌ఈసీగా అనిల్‌చంద్ర పునేఠా

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:09 AM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ చంద్ర పునేఠాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్‌ఈసీగా అనిల్‌చంద్ర పునేఠా

  • పంచాయతీ రాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ

అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ చంద్ర పునేఠాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునేఠాను నియమిస్తూ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఈ మేరకు ఆదేశాలిచ్చారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 03:09 AM