Share News

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునేఠా!

ABN , Publish Date - Apr 16 , 2026 | 05:48 AM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా(ఎస్‌ఈసీ) రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ చంద్రపునేఠా నియమితులు కానున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునేఠా!

  • త్వరలోనే నియామకం.. విజిలెన్స్‌ కమిషనర్‌గా నీరభ్‌ కుమార్‌

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా(ఎస్‌ఈసీ) రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ చంద్రపునేఠా నియమితులు కానున్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. త్వరలోనే గవర్నర్‌ ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. పునేఠా రాష్ట్రంలో అనేక కీలక పదవులు నిర్వహించారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ ఫిర్యాదుల నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆయనను ఈ పోస్టు నుంచి తప్పించింది. తర్వాత ఆయన రిటైర్‌ అయ్యారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక.. గత ఏడాది పునేఠాను విజిలెన్స్‌ కమిషనర్‌గా నియమించారు. ఇప్పుడు అదేపదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సమర్థుడైన పునేఠాను ఎంపిక చేసినట్లు తెలిసింది. మరో రిటైర్డ్‌ ఐఏఎస్‌, మాజీ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ను పునేఠా స్థానంలో విజిలెన్స్‌ కమిషనర్‌గా నియమించాలని నిర్ణయించారు.

Updated Date - Apr 16 , 2026 | 05:49 AM