ఎల్‌నినోను ఎదుర్కొందాం!
ABN , Publish Date - May 30 , 2026 | 04:17 AM
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తగ్గే ప్రమాదం ఉందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో..
రైతులను సన్నద్ధం చేయనున్న శాస్త్రవేత్తలు
నేడు విశ్వవిద్యాలయంలో కీలక వర్క్‌షాప్
(గుంటూరు సిటీ, ఆంధ్రజ్యోతి)
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తగ్గే ప్రమాదం ఉందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. రైతులను అప్రమత్తం చేసి పంటలను కాపాడేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) కార్యాచరణ ప్రకటించింది. తక్కువ వర్షపాతం, పెరిగే ఎండలతో... కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏ పంటలు సాగు చేయాలి? ఏ ప్రాంతంలో ఏ పంటలు అనుకూలం? రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి కీలక అంశాలపై చర్చావేదికను నిర్వహిస్తోంది. శనివారం గుంటూరు లాం క్యాంప్‌సలో భారీస్థాయిలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్-జూన్ 2026 వరకు తటస్థ పరిస్థితులు కొనసాగవచ్చని, ఆతర్వాత ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ సంక్షోభాన్ని తగ్గించడం, ఆహార భద్రతను కాపాడటం, రైతులు, వ్యవసాయ సిబ్బందికి ముందస్తు మార్గదర్శకాలు అత్యవసరమని ఆంగ్రూ భావిస్తోం ది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రచనపై శనివారం ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఉపకులపతి సత్యనారాయణ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు.