Share News

వ్యవ ‘సాయానికి’ గుర్తింపు!

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:40 AM

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025-26కి గాను విశిష్ట ేసవలు అందించిన శాస్త్రవేత్తలు..

వ్యవ ‘సాయానికి’ గుర్తింపు!

  • ఆంగ్రు శాస్త్రవేత్తలు, రైతులకు స్వర్ణ పతకాలు

గుంటూరు సిటీ, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025-26కి గాను విశిష్ట ేసవలు అందించిన శాస్త్రవేత్తలు, ఉత్తమ రైతులు, చెరకు రైతులు, పరిశ్రమలకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్‌ పీవీ సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, నాబార్డు మాజీ చైర్మన్‌, ఐఐఎఫ్ఎల్‌ ఫైనాన్స్‌ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు చేతులు మీదుగా అందజేశారు.

శాస్త్రవేత్తలకు ఎనిమిది స్వర్ణ పతకాలు

డాక్టర్‌ జోగిరెడ్డి రామచంద్రారెడ్డి-లలితమ్మ ఎండోమెంట్‌ గోల్డ్‌ మెడల్‌ను లాం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ జె.సతీశ్‌బాబుకు ప్రదానం చేశారు. డాక్టర్‌ ఏవీ కృష్ణయ్య మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్‌ను నంద్యాలకు చెందిన డాక్టర్‌ బీవీ రవిప్రకాశ్‌రెడ్డి అందుకున్నారు. వల్లభనేని లక్ష్మమ్మ-సుబ్బనరసయ్య గోల్డ్‌ మెడల్‌ను డాక్టర్‌ రాణి చాపరా, శ్రీ నీలకంఠపురం కావేరప్ప గోల్డ్‌ మెడల్‌ను డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, ఎడారా సుబ్బాయమ్మ-వెంకటరావు మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్‌ను డాక్టర్‌ యు.త్రివేణి, వీరపనేని నరసింహం మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్‌ను డాక్టర్‌ పి.నాగమణి అందుకున్నారు. ఎంఎస్‌ కేసీపీ లిమిటెడ్‌, ఉయ్యూరు ఎండోమెంట్‌ గోల్డ్‌ మెడల్‌ను ఏపీజీసీ, లాం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జె. శైలజారాణి, వి.ఆర్‌.దుర్గాంబ చారిటబుల్‌ ట్రస్ట్‌, చెన్నై ఎండోమెంట్‌ గోల్డ్‌ మెడల్‌ను డాక్టర్‌ వి.గౌరి అందుకున్నారు.


ఉత్తమ రైతు అవార్డులు

డాక్టర్‌ ఎంవీ రెడ్డి ఉత్తమ రైతు అవార్డును చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగభైరు శ్రీనివాసరావు, కడప జిల్లా తిప్పి రెడ్డి పల్లికి చెందిన పి.రాజశేఖర్‌లకు ప్రదానం చేశారు. డాక్టర్‌ వి.రామచంద్రరావు ఉత్తమ రైతు అవార్డును అన్నమయ్య జిల్లా అయ్య వారి పల్లికి చెందిన బి.స్వాతి, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన కె ఆదినారాయణకు అందజేశారు.

చెరకు రైతులు, పరిశ్రమలకు గుర్తింపు

ఎంఎస్‌ కేసీపీ లిమిటెడ్‌, ఉయ్యూరు ఎండోమెంట్‌ గోల్డ్‌ మెడల్‌ కింద కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం దేవరపల్లికి చెందిన నాగళ్ల బ్రహ్మయ్య, చిత్తూరు జిల్లా అన్నూరుకు చెందిన టి. రమణయ్య, శ్రీకాకుళం జిల్లా తాండ్యాల పేటకు చెందిన ముయ్య శ్రీను కు పురస్కారాలు అందజేశారు. వీఆర్‌ దుర్గాంబ చారిటబుల్‌ ట్రస్ట్‌, చెన్నై ఎండోమెంట్‌ గోల్డ్‌ మెడల్‌ కింద పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరానికి చెందిన ముండ్రు సంధ్యారాణి, చిత్తూరు జిల్లాలోని ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థను సత్కరించారు.

Updated Date - Jun 13 , 2026 | 04:40 AM