Share News

సమస్యల పరిష్కారం కోరుతూనేటి నుంచి అంగన్వాడీల రిలే దీక్షలు

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:54 AM

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నుంచి ఈనెల 27వరకు రిలే దీక్షలు చేపడుతున్నట్టు, మార్చి 2న విజయవాడలో మహాధర్నా..

సమస్యల పరిష్కారం కోరుతూనేటి నుంచి అంగన్వాడీల రిలే దీక్షలు

  • 2న విజయవాడలో మహాధర్నా

విజయవాడ సిటీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నుంచి ఈనెల 27వరకు రిలే దీక్షలు చేపడుతున్నట్టు, మార్చి 2న విజయవాడలో మహాధర్నా చేస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్ల ప్రతినిధులు కె.సుబ్బరావమ్మ, ఎన్‌సీహెచ్‌ సుప్రజ, లలితమ్మ, వీఆర్‌ జ్యోతి తెలిపారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అంగన్వాడీలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు.

Updated Date - Feb 23 , 2026 | 04:54 AM