‘అంగనవాడీల వేతనాలు పెంచాలి’
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:35 PM
అంగనవాడీలకు వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ డిమాం డ్ చేశారు.
ఎమ్మిగనూరు టౌన, మార్చి 31(ఆంధ్రజ్యోతి): అంగనవాడీలకు వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ డిమాం డ్ చేశారు. పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ముందు మంగళవారం యూనియన ప్రాజెక్ట్ కార్యదర్శి గోవర్ధనమ్మ అధ్యక్షతన ధర్నా చేపట్టారు. రాధాకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగనవాడీలకు వేతనాలు పెంచకుండా మొండిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అయితే అంగనవాడీలకు మాత్రం వేతనాలు పెంచడం లేదన్నారు. 2023 డిసెంబరులో 42 రోజులు రాష్ట్రవ్యాప్తంగా అంగనవాడీలు సమ్మె చేసినా వైసీపీ ప్రభుత్వం అంగనవాడీలకు వేతనం పెంచలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కూడా వేతనాలు పెంచుతామన్న ఎన్నికల హామీని విస్మరించిందని వాపోయారు. కార్యక్రమంలో సీఐటీయూ తాలుకా అధ్యక్షుడు గోవింద్, కార్యదర్శి రా ముడు, కార్యకర్తలు నాగలక్ష్మి, నాగశిరోమణి, అనూరాధ పాల్గొన్నారు.