Share News

అంగన్వాడీలకు అరకొర బడ్జెట్‌

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:10 AM

కేంద్ర బడ్జెట్‌ 2026-27లో అంగన్వాడీలకు వేతనాల పెంపు, స్కీం నిర్వహణకు సరిపోను బడ్జెట్‌ కేటాయించనందుకుగాను మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టు...

అంగన్వాడీలకు అరకొర బడ్జెట్‌

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు

అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌ 2026-27లో అంగన్వాడీలకు వేతనాల పెంపు, స్కీం నిర్వహణకు సరిపోను బడ్జెట్‌ కేటాయించనందుకుగాను మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టు, మండల కేంద్రాల్లో నిరసనలు తెలపనున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబిరాణి, సుబ్బరావమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్‌లో అంగన్వాడీలకు వేతనాల పెంపు, స్కీం నిర్వహణకు సరిపోను బడ్జెట్‌ కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. దీనికి నిరసనగా ఆలిండియా కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపి, బడ్జెట్‌ కాపీలను తగలబెట్టాలని పిలుపునిచ్చారు.

Updated Date - Feb 03 , 2026 | 06:10 AM