Share News

అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతులు

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:24 AM

అంగన్వాడీ హెల్పర్‌(ఆయా)లను అంగన్వాడీ వర్కర్‌(కార్యకర్త)లుగా పదోన్నతులు కల్పించడానికి శుక్రవారం మహిళా, శిశు సంక్షేమశాఖ సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.

అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతులు

  • కొత్త మార్గదర్శకాలు విడుదల

అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ హెల్పర్‌(ఆయా)లను అంగన్వాడీ వర్కర్‌(కార్యకర్త)లుగా పదోన్నతులు కల్పించడానికి శుక్రవారం మహిళా, శిశు సంక్షేమశాఖ సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. వర్కర్‌ ఖాళీల్లో 50 శాతం పోస్టులను అర్హత కలిగిన హెల్పర్లతోనే భర్తీ చేయాలి. నియామక సం వత్సరం జూలై 1 నాటికి 50 ఏళ్లు పూర్తి కాకూడదు. పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. శారీరకంగా ఫిట్‌నెస్‌ ఉండాలి. హెల్పర్‌గా కనీసం ఐదేళ్లు సేవ పూర్తి చేసి ఉండాలి. ఒక గ్రామం, లేదా వార్డులో ఒకటి కంటే ఎక్కువ అంగన్వాడీ కేంద్రాలున్నప్పుడు సీనియారిటీ పరిగణనలోకి తీసుకోవాలి. సీనియారిటీ సమానంగా ఉంటే.. వయస్సులో పెద్ద/లేదా అధిక విద్యార్హతను పరిగణనలోకి తీసుకోవాలి. పదోన్నతుల అమలులో ప్రభుత్వ రిజర్వేషన్‌ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 04:26 AM