ఏయూ @ 100!
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:36 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటలకు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ....
నేడు శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం
27న ముగింపు కార్యక్రమానికి ఏర్పాట్లు
ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్,చంద్రబాబు, పవన్, లోకేశ్, మాజీ క్రికెటర్ సచిన్
విశాఖపట్నం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటలకు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో అనుబంధ కళాశాలల ఆధ్వర్యంలో ‘ఏ సెంచరీ ఆఫ్ పార్టనర్‌షిప్’ అంశంపై కార్యక్రమం జరగనుంది. తొలిరోజు కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ లావు రత్తయ్య, విశిష్ట అతిథిగా ఉన్నత విద్య కమిషనర్ డాక్టర్ ఎన్.భరత్ గుప్తా హాజరు కానున్నారు. అలాగే, 19న ఏయూ ఆర్ట్స్ అండ్ కామ ర్స్ కళాశాలలు, ఐఏఎ్‌సఈ, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (సిబ్) ఆధ్వర్యంలో, 21న కాలేజీ ఆఫ్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, 22న ఏయూ ఇంజనీరింగ్ కళాశాల- మహిళా ఇంజనీరింగ్ కళాశాల, 23న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విశిష్ఠ అతిథుల ప్రసంగాలు, పూర్వ విద్యార్థులకు సన్మానాలు, సత్కారాలు, అవగాహన ఒప్పందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 27న నిర్వహించే ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తదితరులు హాజరు కానున్నారు.