ఆంధ్రా సుగర్స్‌లో సోలార్ ప్లాంట్ ప్రారంభం
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:54 AM
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా సుగర్స్ ప్రాంగణంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో సొంత అవసరాల నిమిత్తం సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మించారు.
తణుకు, జూలై16(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా సుగర్స్ ప్రాంగణంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో సొంత అవసరాల నిమిత్తం సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మించారు. 1.5 మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్ ప్లాంట్‌ను సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల నరేంద్రనాథ్ చౌదరి గురువారం ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సౌర ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తణుకు కర్మాగారంలో అవసరాలకు ఉపయోగించుకుంటామని వివరించారు. కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుతరామయ్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎన్‌ఆర్‌కే.రంగారావు, సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.