బుల్లిరామయ్య సేవలు మరువలేనివి
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:29 AM
ఆంధ్రా సుగర్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సంస్థ అభివృద్ధికి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా దేశాభివృద్ధికి డాక్టర్ బోళ్ల బుల్లిరామయ్య అందించిన సేవలు మరుపురానివని..
ఆంధ్రా సుగర్స్ ఉద్యోగుల ఘననివాళి
తణుకు, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా సుగర్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సంస్థ అభివృద్ధికి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా దేశాభివృద్ధికి డాక్టర్ బోళ్ల బుల్లిరామయ్య అందించిన సేవలు మరుపురానివని సంస్థకు చెందిన పలువురు ఉద్యోగులు కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా సుగర్స్ ప్రాంగణంలో గురువారం బుల్లిరామయ్య శత జయంతి నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. బుల్లిరామయ్య సేవలను స్మరించుకుని, మిఠాయిలను పంచుకున్నారు. కార్యక్రమంలో సంస్థ అడిషనల్ సెక్రటరీ పీవీఎ్‌స.విశ్వనాథకుమార్, జనరల్ మేనేజర్ ఎ.సాంబశివరావు, వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.