‘ఇండియా స్కిల్స్’లో రాష్ట్రానికి 23 పతకాలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:55 AM
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 23 పతకాలు దక్కాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ కూరం రఘు తెలిపారు.
2 బంగారు, 8 వెండి, 3 కాంస్య, 10 ఎక్స్‌లెన్స్ అవార్డులు
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 23 పతకాలు దక్కాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ కూరం రఘు తెలిపారు. రెండు బంగారు, 8 వెండి, మూడు కాంస్య పతకాలు, 10 మెడలియన్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డులు లభించాయని బుధవారం ఓ ప్రకటనలో వివరించారు. పతకాలు సాధించినవారిని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేశ్‌కుమార్ తాడేపల్లి కార్యాలయంలో అభినందించారని తెలిపారు.