Share News

పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి..రూ.46,488 కోట్లు కావాలి

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:32 AM

రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.46,488.43 కోట్లు కేటాయించాలని జలవనరుల శాఖ ప్రతిపాదించింది.

పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి..రూ.46,488 కోట్లు కావాలి

  • 2026-27 బడ్జెట్‌లో కేటాయించాలని జల వనరుల శాఖ ప్రతిపాదనలు

  • రేపు పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖ సమీక్ష

అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.46,488.43 కోట్లు కేటాయించాలని జలవనరుల శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను ప్రాథమికంగా సమీక్షించిన ఆర్థిక శాఖ.. మంగళవారం నాటి సమీక్షలో సమగ్రంగా చర్చించి.. తేలుద్దామని స్పష్టం చేసింది. 2026-27 ప్రతిపాదనల్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.10,866.27 కోట్లు విడుదల చేయాలని జలవనరుల శాఖ కోరింది. భారీ ప్రాజెక్టుల కోసం రూ.9,463 కోట్లు, తెలుగుగంగ-3,229 కోట్లు, తుంగభద్ర-1,122 కోట్లు, కడప నీటిపారుదల ప్రాజెక్టులు-3,185 కోట్లు, అనంతపురం ప్రాజెక్టులు-4,374 కోట్లు, కర్నూలు ప్రాజెక్టులు-1,329 కోట్లు, ఒంగోలు ప్రాజెక్టులు-1,745 కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు-1,350 కోట్లు, గోదావరి డెల్టా సిస్టమ్‌-553 కోట్లు, కృష్ణా డెల్టా సిస్టమ్‌కు రూ.4,682 కోట్లను ప్రతిపాదించింది.

Updated Date - Feb 02 , 2026 | 06:34 AM