ముస్లింలకు ఉచిత కార్పొరేట్ విద్య: అజీజ్
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:56 AM
రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో...
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రతి ఏటా 500 మంది ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత కార్పొరేట్ విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టామని అనంతరం అజీజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ట్యాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్య అందిస్తామన్నారు. ఆ ఖర్చును పూర్తిగా వక్ఫ్‌బోర్డు భరించే విధంగా బోర్డు సమావేశంలో తీర్మానించామని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యతోపాటు జేఈఈ మెయిన్స్, నీట్ శిక్షణ కూడా అందిస్తామన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 250 మందికి తొలుత ఉచిత విద్యను అందిస్తామని, ఆ తర్వాతి ఏడాది నుంచి ఏటా 500 మందికి ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. పదో తరగతి ఫలితాల తర్వాత ట్యాలెంట్ టెస్ట్ నిర్వహించి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.