Share News

వీబీజీరామ్‌జీపై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:56 AM

వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ పథకాన్ని జూలై 1 నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ..

వీబీజీరామ్‌జీపై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు

  • 28 జిల్లాల డ్వామా పీడీలు హాజరు

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ పథకాన్ని జూలై 1 నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించింది. ఉపాధి హామీ పథకం డైరక్టర్‌ షణ్ముఖ్‌కుమార్‌, అదనపు కమిషనర్‌ శివప్రసాద్‌తోపాటు.. 28 జిల్లాల డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు, అనుసంధాన శాఖల అధికారులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీబీజీరామ్‌జీ పథకం ముఖ్యాంశాలు, కేటగిరీ వారీ పనులు, గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీ కార్డు జారీ, గ్రామ ప్రణాళిక రూపకల్పన, సామాజిక తనిఖీ నిర్వహణ తదితర అంశాలను అధికారులు వివరించారు.

Updated Date - Jun 13 , 2026 | 04:57 AM